విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేశారు. ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొల్లు రవీంద్ర
By
Published : Mar 6, 2019, 9:29 PM IST
కొల్లు రవీంద్ర
తెదేపా సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు వైకాపా నాయకులు కుట్ర చేశారనిమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మచిలీపట్నంలో తెదేపా కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. 87 వేల ఓట్లు తొలగించడానికి ప్రయత్నించడం అమానుష చర్యఅన్నారు. బాధ్యులను గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.