రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటి హక్కులను సీఎం జగన్.. తెలంగాణకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం దాదాపు 8 ప్రాజెక్టులను నిర్మిస్తుంటే ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తైతే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ సర్కార్ పాలమూరు, రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కొల్లు వివరించారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం, కృష్ణానది యాజమాన్యబోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని, బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు లేవని చెప్పారు. అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మాజీ మంత్రి నిలదీశారు.