మంత్రి పేర్నినానికి.. తమ పార్టీ అధినేత చంద్రబాబుని విమర్శించే అర్హత లేదని మాజీ మంత్రి, తెదేపా నాయకుడు కొల్లు రవీంద్ర అన్నారు. వైకాపా ప్రభుత్వ దోపిడిపై మంత్రి పేర్నినానితో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. తేదీ, వేదిక, సమయం పేర్ని నాని చెప్పినా సరే.... లేదంటే తనను చెప్పమన్నా సరే అని సవాల్ చేశారు.
పేర్ని నాని మచిలీపట్నంలో బ్లీచింగ్ పేరు చెప్పి మైదా చల్లి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ మంత్రులకు కళ్లు నెత్తికి ఎక్కాయని విమర్శించారు. ప్రజల కోసం తాము పని చేస్తే... దోపిడీ చేసేందుకు వైకాపా పని చేస్తోందని ఆరోపించారు.