ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kodali Nani: మంత్రి పదవి నాకు వెంట్రుకతో సమానం: కొడాలి నాని - కొడాలి నాని కామెంట్లు

Kodali Nani: మాజీ మంత్రి కన్నా.. గుడివాడ ఎమ్మెల్యే అని పిలిపించుకోవడమే తనకు ఇష్టమని కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడులో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ నూతన విగ్రహాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు.

Kodali Nani
మంత్రి పదవి నాకు వెంట్రుకతో సమానం

By

Published : Apr 24, 2022, 7:20 AM IST

Kodali Nani: తనను మాజీ మంత్రి అని అందరూ సంభోదించడం ఇష్టం లేదని,.. గుడివాడ ఎమ్మెల్యే అని పిలిపించుకోవడానికే ఇష్టపడతానని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమని, ఎమ్మెల్యే పదవి లేకుంటేనే ఎక్కువ బాధపడతానన్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడులో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ నూతన విగ్రహాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ... ‘పదవి ఉన్నా.. లేకున్నా జగన్‌ వెంటే ఉంటాను. పవన్‌కల్యాణ్‌ చంద్రబాబు దత్తపుత్రుడు. ఆయనతో పాటు లోకేశ్‌ రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారు. జగన్‌ లేకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది...’ అని పేర్కొన్నారు. ఎంపీ సురేష్‌ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందిస్తే, బాబూ జగ్జీవన్‌రామ్‌ దాని ఫలాలను అట్టడుగువర్గాలకు అందించిన వ్యక్తి అని కొనియాడారు.

ఇదీ చదవండి: విద్యుత్తు వాహనం.. పేలుడుకు ప్రధాన కారణాలివే...

ABOUT THE AUTHOR

...view details