కృష్ణా జిల్లాలో 264 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వివరించారు. గుడివాడ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకూ రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి రూ.4 కోట్లు చెల్లించామని మంత్రి చెప్పారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చిన ఆయన... వీటిపై ఎలాంటి అపోహలు ఉన్నా 1800 425442 నంబరుకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని మంత్రి కొడాలి నాని అన్నదాతలకు సూచించారు.
'అపోహలు నమ్మొద్దు... ప్రభుత్వమే ధాన్యం కొంటుంది' - kodali nani comments
కృష్ణా జిల్లాలో 264 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి కొడాలి నాని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి అపోహలు నమ్మొద్దని, సందేహాలు ఉంటే 1800 425442 నంబరుకు ఫోన్ చేయాలని మంత్రి సూచించారు.
'అపోహలు నమ్మొద్దు...ప్రభుత్వమే ధ్యానం కొంటుంది'
Last Updated : Dec 7, 2019, 9:48 PM IST