ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాఠశాలలను పూర్వ విద్యార్థులు దత్తత తీసుకోవాలి' - amma vodi

'పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి. ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలో హామీ ఇచ్చారు.. దానిని అమలు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది': మంత్రి కొడాలి నాని

కొడాలి నాని

By

Published : Jun 20, 2019, 12:47 PM IST

'పాఠశాలలను పూర్వ విద్యార్థులు దత్తత తీసుకోవాలి'

ప్రముఖ గుండె వైద్యుడు డా.గోపాల కృష్ణ గోఖలే తాను చదువుకున్న కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశ జిల్లాపరిషత్ పాఠశాలలో సుమారు 30 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఈ ప్రారంభోత్సవానికి మంత్రి కొడాలి నాని, జిల్లా పరిషత్ ఛైర్మన్ గద్దె అనురాధ హాజరయ్యారు. సహృదయ ట్రస్టు మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని మంత్రి కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. 'అమ్మఒడి' పథకం ద్వారా పేద విద్యార్థులందరికీ విద్యను అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలను మారుస్తాం అని మంత్రి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details