ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వన్ నేషన్ వన్ కార్డు విధానం కేంద్రం నిర్ణయిస్తే అమలు చేస్తాం'

By

Published : Feb 18, 2020, 11:31 PM IST

వన్ నేషన్ వన్ కార్డు విధానం కేంద్రం నిర్ణయిస్తే అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కేంద్ర ఆహార శాఖ మంత్రి పాసవాన్‌ను మంత్రి కొడాలి నాని దిల్లీలో కలిశారు. ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరినట్టు మంత్రి తెలిపారు.

Kodali Nani meets union minister paswan
కొడాలి నాని

కేంద్ర ఆహారశాఖ మంత్రి పాసవాన్‌ను మంత్రి కొడాలి నాని దిల్లీలో కలిశారు. ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిన రూ.4 వేల కోట్లు ఇవ్వాలని కోరినట్టు మంత్రి తెలిపారు. ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లోని ధాన్యం నిల్వలు ఖాళీ చేయాలని కోరినట్లు వివరించారు. ఎక్కువ మందికి రేషన్‌ కార్డులు వచ్చేలా నిబంధనలు సడలిస్తామని మంత్రి చెప్పారు. ఆరోగ్యశ్రీ, బోధనాఫీజు కార్డులు ప్రత్యేకంగా ఇస్తున్నామని.. దీని వల్ల 9 లక్షల మంది తమ రేషన్ కార్డులు వెనక్కి ఇచ్చారని వివరించారు. 6 లక్షల కార్డులు పరిశీలిస్తున్నామని... తనిఖీ చేసి అర్హులకు ఇస్తామని అన్నారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియన్న మంత్రి ఆయన.. వన్ నేషన్ వన్ కార్డు విధానం కేంద్రం నిర్ణయిస్తే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details