అవును బాలయోగి ఆస్తులు కాజేశాను : కేశినేని నాని - tdp
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్ లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీట్ ల యుద్ధం ఆపేస్తున్నాని నిన్న ప్రకటించాక.. నాని... బుద్ధా వెంకన్న గతంలో చేసిన ట్వీట్ పై స్పందిస్తూ ఇవాళ ప్రతి ట్వీట్ చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇటీవల బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ....నేను నిజంగా బాలయోగి ఆస్తులు కాజేసానని, ఆయన ఆస్తులు నీతి, నిజాయితీ, ప్రజల్ల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి అని రీ ట్వీట్ చేశారు. వీటిని కాజేసి పాటిస్తునందుకు చాలా గర్వ పడుతున్నానాని వెల్లడించారు. గతంలో బుద్ధా వెంకన్న బాలయోగి ఆస్తులు కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు అంటూ కేశినేనిని విమర్శించారు. నేను చెప్పాల్సిన నిజాలు చాల ఉన్నాయని, వినే ధైర్యం నీకుందా అంటూ కేశినేనికి ట్వీట్టర్ వేదికగా సవాలు విసిరారు.