RESERVATIOS: కేంద్రం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యాసంస్థల ప్రవేశాలు, ఉద్యోగ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాక గత ప్రభుత్వం కాపులకు 5 శాతం, మిగిలిన అగ్రవర్ణాల పేదలకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 14, 15 చట్టాలను తెచ్చింది. 2019 మార్చి నుంచి అమలు చేసింది. ఈడబ్ల్యూఎస్వర్గాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం కాపులకు 5 శాతం, మిగిలినవారికి ఐదు శాతం ఇస్తూ చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని..103వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాన్ని అది ఉల్లంఘించిన ట్టవుతుందని హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది.
రాష్ట్రంలో 5 శాతం రిజర్వేషన్ కోసం కాపుల డిమాండ్.. - ఏపీ తాజా వార్తలు
RESERVATIOS: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం కోసం ఆ సామాజికవర్గం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేయకుండా ..కోర్టులో కేసులున్నాయంటూ ఇన్నాళ్లూ దాటవేస్తూ వచ్చారు. తాజాగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం స్పష్టతనిచ్చినందున ఇప్పుడు ప్రభుత్వ వైఖరి ఎలా ఉండనుందన్న చర్చ కొనసాగుతోంది.
103వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నందున.. కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లను మళ్లీ రెండు భాగాలు చేస్తూ రాష్ట్రం తెచ్చిన చట్టాలు చెల్లుతాయా? లేదా? అన్నది ప్రతివాదుల నుంచి కౌంటర్ అఫిడవిట్లు తీసుకోకుండా నిర్ణయించలేమని హైకోర్టు పేర్కొంది. రిట్ పిటిషన్‌పై కోర్టు ఇచ్చే తీర్పుపై నిర్ణయం ఆధారపడి ఉంటుందన్న నిబంధనతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ప్రకారం విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అనుమతించింది. ఈ మధ్యంతర ఉత్తర్వును కారణంగా చూపుతూ వైకాపా ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పక్కనబెట్టేసింది.
ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించినందున దీని ఆధారంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని అమలు చేయాలని.. ఆ సామాజికవర్గానికి చెందినవారు డిమాండ్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కోర్టులు ఎక్కడా తప్పుపట్టలేదని, ఒకవేళ ఇప్పటికీ కోర్టుల్లో కేసులుంటే తుది తీర్పునకు లోబడి ఉండేలా ఐదు శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: