కల్యాణం..కమనీయం - జగ్గయ్యపేట
మాఘపౌర్ణమి సందర్భంగా రంగనాయక స్వామి, గోదా అమ్మవార్ల కల్యాణం కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వైభవంగా జరిగింది.
వైభవంగా కల్యాణం
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని పాలేటి తీరంలో పురాతన రంగనాయక స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా రంగనాయక స్వామి, గోదా అమ్మవార్ల కల్యాణం కనుల పండువగా జరిగింది. పండు వెన్నెలలో సాంప్రదాయబద్ధంగా కల్యాణ వేదిక పై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి... వేదపండితులు మంత్రోచ్ఛరణ, జీలకర్ర -బెల్లం, మాంగల్య ధారణ వంటి క్రతువులను ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.