విరసం నేతలను తక్షణమే విడుదల చేయాలి - బీమా కోరేగావ్
బీమా కోరేగావ్ ఘటనలో అరెస్టు చేసిన వరవరరావు, సాయిబాబాలను తక్షణమే విడుదల చేయాలని విరసం నేత కళ్యాణ్రావు డిమాండ్ చేశారు.
విరసం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరాయి. విజయవాడ ధర్నాచౌక్లో నిరసన దీక్షా శిబిరాన్ని విరసం నేత కళ్యాణ్రావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమస్యలపై స్పందించడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అయితే... దానికి ప్రజాస్వామ్యం అనే పేరు పెట్టొద్దన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని నియంతృత్వ ధోరణితో అక్రమంగా అరెస్టు చేసి నిర్భంధించడం అప్రజాస్వామిక చర్యేనని పేర్కొన్నారు. తక్షణమే వరవరరావు, సాయిబాబాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.