ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మవారి ఆశ్రమం... ఎన్నో ఆశ్చర్యాలకు నిలయం - kadambari shayamaka ashram

ఒకరిద్దరితో మొదలైన పూజ కాలక్రమేణా కాదంబరి శ్యామక ఆశ్రమం వరకు ఎదిగింది. కలశంతో కూడిన అమ్మవారి విగ్రహం, లక్షా ఎనిమిది వేల రుద్రాక్షలతో కూడిన అమ్మవారి మండపం, విశిష్టత కలిగిన శంఖులు, బంగారు శివలింగం, కలశంతో కూడిన అమ్మవారి విగ్రహం ఇక్కడ దర్శనమిస్తాయి.

అమ్మవారు

By

Published : Oct 2, 2019, 10:34 PM IST

అమ్మవారి ఆశ్రయం... ఎన్నో ఆశ్చర్యాలకు నిలయం

కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్​లో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక శ్యామక ఆశ్రమంలో అమ్మవారు 10 రకాల అలంకారాలతో నిత్యం భక్తులకు దర్శనమిస్తోంది. 21 రకాల నిత్య హారతులు అమ్మవారికి చేస్తుంటారు. 72 రకాల సుగంధ ద్రవ్యాలతో 108 కిలోల కుంకుమ కలిపి కుంకుమ పూజ నిర్వహిస్తారు. తెల్లజిల్లేడు చెట్టులోని వినాయకుడి ఆకారం భక్తులతో విశేష పూజలు అందుకుంటోంది. సాలాగ్రామాలు, విశిష్టమైన శంఖులు, బంగారు శివలింగం అమ్మవారి సేవలో తరిస్తున్నాయి. రుద్రాక్ష పూసలు, కమలాక్ష పూసలు, వైజయంతి పూసలతో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరిస్తుంటారు. ఇక్కడ పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత నక్షత్ర తాబేళ్లను అమ్మవారికి సమర్పిస్తుంటారు. దసరా పండగ రోజు అమ్మవారికి కుంభం సమర్పణతో పూజ పూర్తవుతుంది. ఈ తొమ్మిది రోజులు మౌనవ్రతంతో పూజలు చేయటం విశేషం.

ABOUT THE AUTHOR

...view details