ఎన్నో దశాబ్దాలుగా దళితులు ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసా...? అంటూ ట్విట్టర్లో తెదేపా నేత,మాజీ మంత్రి జవహర్, జగన్‌ను ప్రశ్నించారు. సీఎం ప్రవేశ పెట్టిన బిల్లు ప్రకారం పరిశ్రమలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్నారు కదా... అందులో దళితులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో వివరించాలని కోరారు. ఇది కొత్తగా వచ్చే సంస్థలకే అమలు చేస్తారా.. లేక ఇప్పటికే ఉన్న సంస్థల్లో కూడానా ...అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత సంస్థలైన సండూర్ పవర్, సాక్షి పత్రికలో ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలిచ్చారో చెప్పగలరా.. అని నిలదీశారు. ముందు వారి సంస్థల్లో స్థానికత పాటించి తరువాత మిగతా సంస్థలలో అమలు చెయ్యాలని జవహర్ డిమాండ్‌చేశారు.
ట్విట్టర్ వేదికగా సీఎంను ప్రశ్నించిన జవహర్... - ట్వీట్
పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ ప్రవేశపెట్టిన బిల్లుపై జవహర్ ప్రశ్నల వర్షం గుప్పించారు. స్థానికులు..స్థానికులకు ఉద్యోగ కల్పన అంటున్న సీఎం.. అసలు తన సొంత సంస్థల్లో స్థానికత పాటించారా...? అంటూ ట్వీట్ చేశారు.
జగన్ ప్రవేశపెట్టిన బిల్లుపై జవహర్ ట్వీట్