విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నీ పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... భాజపాతో కలిసి ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో గెలుపే ధ్యేయంగా కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. జనసేన పార్టీ యువతకు పెద్దపీట వేస్తోందని అన్నారు. తొలి విడతలో భాగంగా ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో నమోదు కార్యక్రమం చేపట్టామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఒక్క రోజులోనే 19వేల సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించామని పేర్కొన్నారు.
భాజపాతో కలిసి ముందుకెళ్తాం: నాదెండ్ల మనోహర్ - పవన్ కల్యాణ్ వార్తలు
రాష్ట్రంలో భాజపాతో కలిసి ముందుకెళ్తామని...ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని జనసేన పార్టీ నేత నాదెళ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో భాగంగా 32 నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
Janasena Leader Nadendla Manohar