ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేనను గెలిపిస్తే... తాగునీటి సమస్య తీరుస్తా! - జనసేన

జనసేన అధికారంలోకి రాగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బత్తిన రాము అన్నారు. నియోజకవర్గంలోని 9వ డివిజన్​లో వామపక్షాలు, బీఎస్పీ నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.

జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారం

By

Published : Apr 4, 2019, 3:34 PM IST

జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారం
జనసేన అధికారంలోకి రాగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బత్తిన రాము అన్నారు. నియోజకవర్గంలోని 9వ డివిజన్​లో వామపక్షాలు, బీఎస్పీ నేతలతో కలిసి ప్రచారం చేశారు. గురునానక్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్ కాలనీల్లో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోజురోజుకూ జనసేనకు పెరుగుతున్న ఆదరణ చూసి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమపై దాడులకు దిగుతున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆటోనగర్​లో నేటికీ తాగునీటి సౌకర్యం లేదని.. అధికారంలోకి రాగానే తాగునీరు అందిస్తామని చెప్పారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details