కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బాలయోగి బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. పట్టణంతో పాటు మండలంలోని గౌరవరం గ్రామానికి చెందిన వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. వారి కుటుంబ సభ్యులను అధికారులు స్థానిక క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయరామన్తో కలిసి పీపీఈ కిట్‌ను ధరించి అనుమానితులను పరామర్శించారు. కేంద్రంలోని వసతుల గురించి అయన వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి ఇస్తున్న వస్తువులను పరిశీలించారు. క్వారంటైన్లో ఉన్న వారిని త్వరలోనే ఇళ్లకు పంపేందుకు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.
జగ్గయ్యపేట క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన విప్ సామినేని - whip smineni udayabhanu
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని క్వారంటైన్ కేంద్రాన్ని విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. అందులో ఆశ్రయం పొందుతున్న వారిని అడిగి వసతుల గురించి తెలుసుకున్నారు. త్వరలోనే వారిని ఇంటికి పంపించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
జగ్గయ్యపేట క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన విప్ సామినేని