ప్రధాన వేదికపై జగన్, గవర్నర్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆశీనులు కాగా.... అనుసంధాన వేదికపై ముఖ్య అతిథులు సహా జగన్ కుటుంబ సభ్యులు ఆశీసునులయ్యారు. జగన్ కుమార్తెలు హర్షిణి రెడ్డి, వర్షా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదిక ముందు వరుస గ్యాలరీలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, జగన్ బంధువులు కూర్చొన్నారు. ఏ2 గ్యాలరీలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు కూర్చొన్నారు. బి1 గ్యాలరీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు ఆశీనులయ్యారు. బి2 గ్యాలరీలో బార్ అసోసియేషన్ సభ్యులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు.
యువనేత ప్రమాణానికి అతిరథ మహారథులు - kcr
రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేసీఆర్, స్టాలిన్‌తో పాటు జగన్ కుటుంబ సభ్యులు అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రమాణ స్వీకారోత్సవంలో జగన్ కుటుంబ సభ్యులు, అతిధులు
జగన్‌కు స్టాలిన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి జగన్‌కు డీఎంకే అధినేత స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన స్టాలిన్ జగన్‌కు శుబాకాంక్షలు చెప్పి ముగించారు
Last Updated : May 30, 2019, 1:31 PM IST