ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నత్తకు పోటీగా సాగునీటి ప్రాజెక్టుల పనులు: కళా వెంకట్రావు

వైకాపా ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయటంపై శ్రద్ధ లేదని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. వ్యవసాయ పనులు మొదలైనా కాల్వల మరమ్మతు పనులు ప్రారంభించలేదని దుయ్యబట్టారు. పోలవరాన్ని రివర్స్ టెండర్స్ పేరుతో రిజర్వు టెండర్ వేశారని అన్నారు.

kala venkata rao
kala venkata rao

By

Published : Jul 26, 2020, 12:50 PM IST

నత్తకు పోటీగా రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. తెదేపా హయాంలో 90 శాతం పనులు జరిగిన ప్రాజెక్టులను... 14 నెలలు అయినా వైకాపా ప్రభుత్వం పూర్తిచేయలేదని దుయ్యబట్టారు.

సొంత సంస్థలకు నీరు పారించుకోవడం మీద ఉన్న శ్రద్ధ... రైతుల పొలాలకు నీరందించడం మీద లేదు. వ్యవసాయ పనులు ప్రారంభం అయినా ఇంత వరకు కాల్వల మరమ్మతులు చేపట్టలేదు. పోలవరాన్ని రివర్స్ టెండర్స్ పేరుతో రిజర్వు టెండర్ వేసి కావాలని నత్తనడకన నడిపిస్తున్నారు. 2019-20 సాగునీటి రంగానికి బడ్జెట్​లో 13,139 కోట్లు కేటాయించి 4,900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది గత బడ్జెట్ కంటే 10.15 శాతం తక్కువగా నిధులు కేటాయించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే అత్యధిక ధరలు ఉండటం సిగ్గుచేటు- కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details