ప్రస్తుతం రాష్ట్రంలోని 37 వేల పైచిలుకు చెరువుల్లో 39 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని గోదావరి, కృష్ణా నదుల నుంచి వేర్వేరు ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని చెరువుల్లో పూర్తి సామర్ధ్యంతో నింపాల్సిందిగా మంత్రి అనిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల్లో 80.25 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని నిల్వ సామర్ధ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా స్పష్టం చేశారు. జూన్ నుంచి ఇప్పటి వరకూ శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా చోట్ల సంతృప్తికర స్థాయిలోనే వర్షాలు కురిశాయని మొత్తం 2,679 టీఎంసీల నీరు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రిజర్వాయర్లు 77 శాతం మేర నిండాయని ఇంకా పూర్తిస్తాయిలో వీటిని నింపాల్సి ఉందని మంత్రి తెలిపారు. చెరువుల నీటి నిల్వ సామర్ధ్యం పెంచేందుకు పూడిక తీయించాలని సూచించారు. అటు ఇతర నీటి సంరక్షణ కట్టడాల వల్ల మరో 21 టీఎంసీ నీరు నిల్వ చేయగలిగామని మంత్రి తెలిపారు.
'వర్షాలు కురుస్తున్నాయ్.. చెరువులను నింపేందుకు కార్యాచరణ చేపట్టండి' - ఏపీలో భారీ వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున చెరువులను నింపేందుకు కార్యాచరణ చేపట్టాలని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
irrigation minister