తెలుగు కవులు, రచయితలను ప్రోత్సహించేలా... ఖండకావ్య, పద్య రచనల పోటీల నిర్వహణకు కృష్ణా జిల్లా అవనిగడ్డలోని మండలి ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఔత్సాహికులను పోటీలకు ఆహ్వానించింది. తెలుగువారి హృదయాలలో చెరగని ముద్ర వేసేలా చిన్న ఖండికలతో కూడిన ఖండ కావ్య పద్య రచనలు చేయాలని మండలి ఫౌండేషన్ అధ్యక్షుడు బుద్ధప్రసాద్ సూచించారు.
మంచి రచనలు చేసిన వారికి బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. రచనల ప్రచురణ బాధ్యత తామే చూసుకుంటామని చెప్పారు. కవులు, రచయితలు తమ రచనలను జూలై 21 లోగా తమ చిరునామాకు పంపాలని మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.