కరోనా వైరస్ నియంత్రణలో నర్సుల సేవలు ఎనలేనివని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో నర్సులను సన్మానించారు.
ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ సైనికులకు చేసిన సేవలకు గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా ఆమె జయంతిని నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.