కృష్ణా జిల్లా కంచికచర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఓ కుటుంబం.. రాజ్యాంగం, ఓటు హక్కు పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. ఆ కుటుంబం అభ్యర్థుల వినూత్నంగా తమ విన్నపం తెలిపింది. కంచికచర్లలోని చిన్నంశెట్టి వీధిలో ఓ ఇంటికి వినూత్న రీతిలో.. 'మా ఇంటి ఓట్లు అమ్మబడవు' అని బ్యానర్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ బోర్డు చూసి కంచికచర్ల వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా బ్యానర్ పెట్టిన టి.అర్జునరావును స్థానికులు మెచ్చుకుంటున్నారు. అందరూ అర్జునరావులా ఆలోచించాలని చర్చించుకుంటున్నారు.
'మా ఇంటి ఓట్లు అమ్మబడవు..!' - AP Elections news
ఓటు అనే రెండక్షరాల పదం మన భవిష్యత్తునే మార్చేస్తుంది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 ఏళ్లు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తోంది. ఇంత అమూల్యమైన ఓటును ఎన్నికల సమయంలో ప్రలోభాలకు లొంగి... నగదు, మద్యం, ఆభరణాలు, చీరలు తీసుకొని ఓటేస్తారు. కానీ చాలాచోట్ల విద్యావంతులు, విజ్ఞులు ఉన్నతంగా ఆలోచించి తమతమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తిత్వం గలవారు కృష్టాజిల్లా కంచికచర్ల మేజర్ గ్రామ పంచాయతీలో వినూత్నంగా ఆలోచించారు.
interesting-banner-on-house-in-kanchikacharla-village