ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు ‘కరోనా’ బీమా - insurance village volunteers, asha workers corona

కరోనా నివారణకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు ‘కరోనా’ బీమా
గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు ‘కరోనా’ బీమా

By

Published : Apr 20, 2020, 5:37 AM IST

కరోనా నివారణకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి బీమా సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా నివారణపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. కరోనా బీమా పరిధిలోకి ఫ్రంట్‌లైన్‌లో ఉన్న వారితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను చేర్చాలని ఆదేశించారు.

ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై దృష్టి పెట్టాలన్న సీఎం.. ప్రతి రెండు, మూడు రోజులకోసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలన్నారు. అనంతరం రాష్ట్రంలో కరోనా పరీక్షలపై సీఎం సమీక్షించారు. నిన్న ఒక్కరోజే 5400 కరోనా టెస్టులు చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. అత్యధిక కరోనా పరీక్షలు చేస్తోన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని జగన్‌కు చెప్పారు. జనాభా ప్రాతిపదికన ప్రతి 10లక్షల మందికి నిర్వహిస్తున్న జాబితాలో రాష్ట్రం రెండో స్థానానికి చేరుకున్నట్లు సీఎంకు తెలిపారు. ర్యాపిడ్‌ కిట్స్‌ వినియోగించకుండానే ఈ స్థాయికి చేరినట్లు అధికారులు వివరించారు. కుటుంబ సర్వేల ద్వారా గుర్తించిన 32వేల మందికీ పరీక్షలు చేయనున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి

సీఎం జగన్​కు ప్రధాని మోదీ ఫోన్

ABOUT THE AUTHOR

...view details