అర్హులైన వారందరికీ వాహనమిత్ర పథకం మూడో విడత ఫలాలు అందించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. మూడో విడత వాహన మిత్ర అమలులో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అసంబద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. అత్యధిక మందిని ఈ పథకం నుంచి బయటకు గెంటేసేందుకు కొత్త షరతులు విధించారని, ఇవి వాహన మిత్ర పథకం ఉద్దేశానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు.
'అర్హులైన వారందరికీ వాహనమిత్ర పథకం మూడో విడత అందించాలి' - vijayawada latest news
విజయవాడలో భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. అర్హులైన వారందరికీ వాహనమిత్ర ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు.
విజయవాడలో భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు సమావేశం