నందిగామలో రైతు సంఘాలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కృష్ణాజిల్లా నందిగామ మండలం కేతవరం గ్రామంలో రైతులను, రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తోందని రైతు సంఘాల సమాఖ్య జిల్లా రాష్ట్ర కార్యదర్శి కోటి రెడ్డి తెలిపారు. పవర్ గ్రిడ్ వారు రైతులకు పరిహారం చెల్లించకుండా వారి భూములలో 765 కేవీ విద్యుత్ హెచ్.టి టవర్ లైన్ వేయడానికి రైతులంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. పరిహారం చెల్లించకుండా పొలంలో పవర్ గ్రిడ్ స్తంభాలను వేయడం వీల్లేదని ప్రశ్నించిన రైతులను అక్కడ ఉన్న పోలీసు అరెస్టు చేశారు. అన్నం పెట్టే రైతన్నను ఇలా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని రైతు సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత పవర్ గిడ్ అధికారులపై ఉందన్నారు. పరిహారం ఇవ్వకుండా పైపులైన్లను వేస్తే దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు .
'అన్నదాత అరెస్టులా...ఇది మంచి పద్ధతి కాదు' - నందిగామ
పవర్‌గ్రిడ్ వారు రైతులను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ....కృష్ణా జిల్లా నందిగామలో రైతు సంఘాలు సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు పరిహారం చెల్లించిన తరువాతే పవర్‌గ్రిడ్ స్తంభాలను పొలంలో వేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న రైతుసంఘాల నాయకులు