కృష్ణాజిల్లా గుడివాడలోని ఆర్సీఎమ్ పాఠశాలలో పది మంది వరకు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. వారిని ఆర్సీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారులను మంత్రి కొడాలి నాని, జేసీ మాధవిలత, ఎస్పీ రవీంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ...గుడివాడ ఆర్సీఎం పాఠశాలకు 70 సంవత్సరాల చరిత్ర ఉందని వెల్లడించారు. ఒకటవ తరగతికి చెందిన ఏడుగురు విద్యార్థులు మధ్యాహ్నాం భోజనం చేయలేదని మంత్రి వివరించారు. చిన్నారులు తాగిన వాటర్, తిన్న బిస్కెట్లు, చాక్లెట్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపించినట్లు మంత్రి తెలిపారు. చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగానే ఉన్నారని....అందరిని క్షేమంగా ఇంటికి పంపించే ఏర్పాట్లు చేశామన్నారు.
గుడివాడలో చిన్నారుల అస్వస్థత...పరామర్శించిన మంత్రి - గుడివాడలో చిన్నారుల ఆస్వస్థత
కృష్ణాజిల్లా గుడివాడలోని ఆర్సీఎం పాఠశాలలో ఒకటవ తరగతికి చెందిన విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. వారిని ఆర్సీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారులను మంత్రి కొడాలి నాని, జేసీ మాధవిలత ఎస్పీ రవీంద్రబాబు పరామర్శించారు.
అస్వస్థతకుగురైన చిన్నారిని చూస్తున్న మంత్రి