ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గని అక్రమ మద్యం సరఫరా.. ఆగని నాటు సారా తయారీ - illegal liquor news

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. నిందితుల తీరులో మాత్రం మార్పు రావటం లేదు. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినా.. పరిమిత సంఖ్యలో మద్యం దుకాణాలు తెరుస్తుండటంతో.. నాటు సారా తయారీదారులు రెచ్చిపోతున్నారు.

liquor caught in different districts
అక్రమ మద్యం పట్టివేత

By

Published : Sep 8, 2020, 9:10 AM IST

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త ఆటోనగర్​లో నిల్వ ఉంచిన తెలంగాణ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఈబీ అధికారులు గోడౌన్​పైద దాడులు చేసినట్లు వివరించారు. ఈ దాడిలో 6 లక్షల విలువైన 855 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన అరెస్టు చేసినట్లు వివరించారు.

విజయనగరం జిల్లాలో..

విజయనగరం జిల్లా మక్కువ మండలం మార్కండపుట్టి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లక్షా 35 వేల విలువైన నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. సారాను తరలించేందుకు ప్రయత్నించిన.. మామిడిపల్లికి చెందిన గంటా నాగరాజు, ఒరిస్సాకు రాష్ట్రానికి చెందిన లింగాలను అదుపులోకి తీసుకున్నారు. 18 గోనె సంచుల్లో 9 వేల నాటు సారా ప్యాకెట్లను తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు మక్కువ ఎస్సై వివరించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కె.కె. నాయుడుపేట గ్రామ సమీపంలో.. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఆటోను పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ 52 వేల రూపాయలు ఉంటుందని ఎస్సై వివరించారు. మద్యాన్ని తరలించేందుకు యత్నించిన కె.కె నాయుడుపేటకు చెందిన వెంకట జనార్ధనరావు, కొచ్చెర్ల గ్రామానికి చెందిన దుర్గయ్యపై కేసు నమోదు చేసిన అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

విశాఖ జిల్లాలో..

విశాఖ జిల్లా మాడుగుల మండలం బూట్ల జాలంపల్లి శివారు ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై ఆబ్కారీ శాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి ఉపయోగించే 1,200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

గవరవరం వద్ద సారా తరలిస్తున్న మాడుగులకు చెందిన ఇందల దేముడు, చీడికాడకు చెందన కూండ్రమ్ సత్యం, శీరంరెడ్డి చలపతిలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బి. జగదీశ్వరరావు వివరించారు.

ఇదీ చదవండి:ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో జాప్యం

ABOUT THE AUTHOR

...view details