ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రిపుల్​ ఐటీ కల సాకారం... ఉన్నత విద్యకు శ్రీకారం...

ఈడబ్ల్యూఎస్​ కోటాలో ఎంతో మంది విద్యార్థుల త్రిపుల్​ ఐటీ కల సాకరమవతోంది. కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్​ఐటీ కళాశాలలో 2019 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైంది. మొదటి విడతో సీటు రాకపోయినా రెండో విడతో సీటు రావడం ఆనందంగా ఉందని కౌన్సెలింగ్​కు వచ్చిన ప్రతి విద్యార్థి ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ట్రిపుల్​ ఐటీ కల సాకారం... ఉన్నత విద్యకు శ్రీకారం...

By

Published : Aug 28, 2019, 12:05 PM IST

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ట్రిపుల్​ ఐటీ ప్రాంగణం, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ లకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైంది. అగ్రవర్ణ పేదలైన తమకు ఈడబ్ల్యూఎస్​ కోటాలో సీటురావడం ఆనందంగా ఉందని విద్యార్థులు,తల్లిదండ్రులు చెబుతున్నారు.

మొదటి విడతలో మిగిలిన జనరల్ కేటగిరిలోని 219 సీట్లుకు ఈ నెల 26వ తేదీన రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభించినట్లు కన్వీనర్‌ తెలిపారు. ఈ డబ్ల్యుఎస్ కోట కింద జీవో నెంబర్ 39 ప్రకారం 400సీట్లు భర్తీ కోసం 600 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలిచినట్టు చెప్పారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

ట్రిపుల్​ ఐటీ కల సాకారం... ఉన్నత విద్యకు శ్రీకారం...

ఇదీ చూడండిఇంజనీర్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details