మచిలీపట్నం బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేసే బాధ్యత మీ చేతుల్లోనే ఉందని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో రెండంకెల అభివృద్ధి సాధించామన్న ఆయన.. ప్రజల అండ ఉంటే మరింత ఉత్సాహంగా ముందుకెళ్తామన్నారు. భూమి పోతోందని, కాలుష్యం పెరుగుతోందని అబద్ధాలు చెబుతూ పోర్టు పనులు ఆపేందుకు వైకాపా దొంగలొస్తే తరిమి కొట్టాలని తెలిపారు.
'వైకాపా దొంగలొస్తే తరిమి కొట్టండి' - PORT
రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని.. ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జిల్లాలో పోర్టు నిర్మాణం పూర్తయితే ఇక్కడి యువతకు ఎక్కువ ఉద్యోగాలొస్తాయన్నారు.
మచిలీపట్నం సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు
కృష్ణా, గోదావరి నదులను అనుసంధానించామన్న ఆయన.. ప్రాజెక్టుల పురోగతిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. 24 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను ఒక్క తెలుగు దేశం మాత్రమే మాఫీ చేసిందన్నారు. ప్రభుత్వానికి సహకరించిన రాజధాని రైతులు.. కోటీశ్వరులయ్యారని చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా రైతులనూ అమరావతి అన్నదాతలకు దీటుగా తయారు చేస్తామని మాటిచ్చారు.