Husband Loknath Maheswara Rao Killed Doctor Macherla Radha in Machilipatnam :రోగుల ప్రాణాలు కాపాడే ఓ వైద్యుడు అత్యంత క్రూరంగా తన భార్యను హత్య చేశాడు. అరవై సంవత్సరాలు దాటిన వయసులో ఆస్తులపై మమకారంతో దాంపత్య బంధానికి, వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించాడు ఓ వైద్యుడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైద్యురాలు మాచర్ల రాధ హత్య కేసు తీవ్ర సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.. ఈ కేసులో పిల్లల వైద్య నిపుణుడు, ఆమె భర్త లోక్‌నాథ్ మహేశ్వరరావు ప్రధాన నిందితుడు అని పోలీసులు తెలిపారు. అతనితో పాటుహత్యకు సహకరించిన కారు డ్రైవర్ జనార్థన్ అలియస్ మధును కూడా అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పర్చారు.
Husband Killed Doctor Macherla Radha in Machilipatnam :శుక్రవారం ఈ కేసు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పి.జాషువా వెల్లడించారు. వైద్య దంపతులైన మహేశ్వరరావు, రాధ మచిలీపట్నం జవ్వారుపేటలోని సొంత వైద్యశాలలో 25 సంవత్సరాలు నుంచి సేవలు అందిస్తున్నారు. గత నెల 25న రాత్రి తన భార్యను హత్య చేసి నగలు దోచుకుపోయరంటూ వైద్యుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. వారి దర్యాప్తులో భర్తే హత్య చేసినట్టు తేలింది. కోట్ల విలువైన ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదాలే హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు.
Doctor Murder: ఇంట్లోకి చొరబడి.. కళ్లలో కారం చల్లి.. మచిలీపట్నంలో డాక్టర్ దారుణ హత్య
భర్తే భార్యను అతి కిరాతకంగా పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిసింది. పదిహేనేళ్లుగా తన వద్ద డ్రైవర్‌గా, అటెండర్‌గా పనిచేస్తున్న మధుకు పెద్ద మొత్తంలో నగదు, బంగారు నగలు ఆశ చూపి హత్యకు సహకరించేలా ఒప్పించిట్లు గుర్తించారు. గత నెల 25వ తేదీ సాయంత్రం ఆసుపత్రి రెండో అంతస్తులో ఒంటరిగా ఉన్న మాచర్ల రాధ వద్దకు లోక్‌నాథ్, డ్రైవర్ మధు వెళ్లారు. మధు ఆమెను పట్టుకోగా భర్త రెంచితో తల వెనుక భాగంలో బలంగా పలుమార్లు దాడి చేశాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. అనంతరం వైద్యురాలు చనిపోయిందని నిర్థారించుకున్నాడు.