విజయవాడ జగ్గయ్యపేట మండలంలోని రావిరాల గ్రామంలోకి భారీగా వరద నీరు ప్రవేశించింది. ముక్త్యాల వెళ్లే మార్గం, వేదాద్రి గ్రామంలో వరదనీరు చుట్టుముట్టింది. దీంతో ఇతర గ్రామాలకు రాకపోకలు తగ్గిపోయాయి. పులిచింతల డ్యామ్ నుండి 8 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా...పశ్చిమ కృష్ణా గ్రామలకు వరదనీటి ముంపు పొంచి ఉంది. దీంతో జగ్గయ్యపేట మండల పరీవాహక గ్రామాల్లో అధికారులు అప్రమత్తమై...గ్రామస్థులను పునారావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పెదలంక, చిన్నలంక గ్రామాల ప్రజలను పడవల్లో అధికారులు ఇబ్రహీంపట్నం చేర్చారు.
వరద ఉద్ధృతికి నీటమునిగిన పుష్కరఘాట్లు - vijayawada
విజయవాడలోని పవిత్ర సంగమం వద్ద వరద ఉద్ధృతికి పుష్కరఘాట్లు నీటమునిగాయి. దీంతో పాటుగా కొన్ని గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో...గ్రామస్థులను ఇళ్లనుండి పునారావాస కేంద్రానికి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామాల్లోకి భారీగా చేరిన వరద నీరు