కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర వసతిగృహంలో మంగళవారం జరిగిన మూడో తరగతి విద్యార్థి హత్యపై పలువురు స్పందించారు. ఈ ఘటన దారుణమని.. వసతి గృహాల్లో భద్రతను పెంచాలని స్థానిక నాయకులు కోరారు. పిల్లల్లో ఇప్పటినుంచే ఇలాంటి విష భావాలు రావడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. టీవీలు, సామాజిక మాధ్యమాలు వారిలో ఈ విపరీత భావాలను పెంచుతున్నాయని ఆవేదన చెందారు. పిల్లల్లో మంచి దృక్పథం పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
'విద్యార్థి మృతి బాధాకరం.. వసతి గృహాల్లో భద్రత పెంచాలి' - చల్లపల్లి
చల్లపల్లి వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి హత్యపై నాయకులు స్పందించారు. టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమాలు పిల్లల్లో విపరీత భావాలకు బీజాలు వేస్తున్నాయని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడ్డారు.
'ఈ ఘటన బాధాకరం.. వసతి గృహాల్లో భద్రతను పెంచండి'