మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థుల ధర్నా - HOMEO PATHI COLLEGE STUDENTS -DHARNA AT GUDIVADA
కృష్ణా జిల్లా గుడివాడ హోమియోపతి కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పరీక్ష తేదీలపై సమాచారం లేక పరీక్ష రాయలేక పోయామంటూ కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.
కృష్ణా జిల్లా గుడివాడ హోమియోపతి కళాశాల ముందు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ నెల 13న జరిగిన ఫిజియాలజీ మొదటి సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష గురించి సమాచారం లేకపోవటంతో పలువురు విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. పరీక్ష రాయలేని వారికి ఈ నెల 25, 26 తేదీల్లో పరీక్ష నిర్వహించేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అంగీకరించింది. అయితే.. ఆలస్యంగా పరీక్షా కేంద్రాకి చేరుకున్న.. అసంపూర్ణంగా పరీక్ష రాసినవారికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. నిబంధనల ప్రకారం ఒకసారి పరీక్షరాసిన వారిని మళ్లీ అనుమతించబోమని ప్రిన్సిపల్ తిప్పేస్వామి తెలిపారు.
TAGGED:
STUDENTS DHARNA