ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళితులకు అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు: హోంమంత్రి - హోంమంత్రి సుచరిత తాజా వార్తలు

వైఎస్సార్​ చేయూత పథకం పేద మహిళలకు మేలు చేస్తుందని హోంమంత్రి సుచరిత అన్నారు. తెదేపా నేతలు కులరాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులపై జరిగిన అన్ని దాడుల్లో.. బాధితులకు న్యాయం చేసామని అన్నారు.

home minister sucharitha
home minister sucharitha

By

Published : Aug 13, 2020, 2:30 PM IST

తెదేపా నేతలు కులరాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, హత్యకేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రలను అరెస్టు చేస్తే బీసీలపై దాడులని తెదేపా ఆరోపిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు దళితులకు అన్యాయం జరుగుతోందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దళితులపై జరిగిన అన్ని దాడుల్లో.. బాధితులకు న్యాయం చేసామని అన్నారు. చీరాల యువకుడి మరణానికి కారణమైన కేసుతో పాటు , దళిత యువకుడికి శిరోముండనం చేసిన అధికారులను సస్పెండ్ చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన వైఎస్​ఆర్ చేయూత పథకం పేద మహిళలకు ఎంతో మేలు కలుగుతుందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఈ పథకం కింద 23 లక్షలకుపైగా మహిళలకు లబ్ధి చేకూరనుందని ఆమె పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు తమ కుటంబాలను ఆర్థికంగా మెరుగుపరచుకోవాలని మంత్రి సూచించారు.

ఇదీ చదవండి :టిక్​టాక్ కొనుగోలు రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్!

ABOUT THE AUTHOR

...view details