విజయవాడలో 15 అగ్నిమాపక యంత్రాలను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ఫైర్ స్టేషన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని హొంమంత్రి తెలిపారు. ఇటీవలి కాలంలో సమకూర్చిన అధునాతన యంత్రాలు, పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను హోం మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ డీజీ అనురాధా సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన హోంమంత్రి - హోంమంత్రి
రాష్ట్రంలో విపత్తులు నివారణ కోసం అగ్నిమాపక శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి సుచరిత తెలిపారు. విజయవాడలో అగ్నిమాపక వాహనాలను ఆమె ప్రారంభించారు.
అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన హోంమంత్రి