ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ సచివాలయ పరీక్షల రోజున విద్యాసంస్థలకు సెలవులు... - secretariat exam

రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

గ్రామ సచివాలయ పరీక్షల రోజున విద్యాసంస్థలకు సెలవులు

By

Published : Aug 23, 2019, 9:20 AM IST

గ్రామ సచివాలయ పరీక్షల రోజున విద్యాసంస్థలకు సెలవులు రోజున

సెప్టెంబర్ 1 నుంచి 6 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామక పరీక్షలకు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 1, 3, 4, 6,7,8 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లోని పలు ఉద్యోగాలకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు అభ్యర్థులు పెద్దఎత్తున హాజరుకానుండటంతో అన్ని జిల్లాల్లో ఎక్కువ పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో పరీక్షలు జరగనున్న దృష్ట్యా... పరీక్షలు జరిగే రోజుల్లో స్థానికంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ప్రభుత్వాన్ని కోరగా... ప్రతిపాదనను ఆమోదించిన ప్రభుత్వం సెలవులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఏర్పాట్లను పర్యవేక్షించాలని...ప్రభుత్వం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details