జాతీయ కబడ్డీ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసే ప్రక్రియలో.. ఆరోణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు పాల్గొనకుండా చూడాలంటూ క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి, స్పోర్ట్ అధారిటీ వైస్ ఛైర్మన్, ఎండీని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య, అధ్యక్షుడు కేఈ ప్రభాకర్ ఆ పోస్టులు నిర్వహించేందుకు అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ క్రీడాకారిణులు గౌతమి , లక్ష్మీ వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు . క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలో పాల్గొనకుండా వారిని నిలువరించాలని కోరారు దీనిపై వాదోపవాదనల అనంతరం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరోణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఆపండి.. క్రీడాశాఖకు హైకోర్డు ఆదేశాలు
క్రీడాశాఖ ముఖ్యకార్యదర్శి, స్పోర్ట్ అధారిటీ వైస్ ఛైర్మన్, ఎండీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ కబడ్డీ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసే ప్రక్రియలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు పాల్గొనకుండా చూడాలంటూ నోటీసులు ఇచ్చింది.
క్రీడాశాఖకు హైకోర్డు ఆదేశాలు