ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూనియర్ సివిల్ జడ్జీల నియామకంపై విచారణ వాయిదా - highcourt

జూనియర్ సివిల్ జడ్జీ ఉద్యోగాల భర్తీ విషయంలో న్యాయవాదిగా మూడేళ్ల అనుభవం లేకపోయినా కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు సమర్పించే దరఖాస్తులను స్వీకరించాలని రిజిస్ట్రార్​ను హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టు

By

Published : Jul 13, 2019, 6:02 AM IST

జూనియర్ సివిల్ జడ్జీల నియామకంపై విచారణ రెండు వారాలకు వాయిదా

జూనియర్ సివిల్ జడ్జీ ఉద్యోగాల భర్తీ విషయంలో న్యాయవాదిగా మూడేళ్ల అనుభవం లేకపోయినా పిటిషనర్ల దరఖాస్తులను స్వీకరించాలని రిజిస్ట్రార్​కు హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల ఎంపిక అంశం హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. కేసులో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్ 17 న జారీ చేసిన జూనియర్ సివిల్ జడ్జిల భర్తీ నోటిఫికేషన్ అభ్యర్ధులకు మూడేళ్లు న్యాయవాదిగా కనీస అర్హత ఉండాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు లేని నిబంధన ఆంధ్రప్రదేశ్ లో ఎందుకని... కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు.

ABOUT THE AUTHOR

...view details