ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్ధానం లాంటి తీవ్రమైన విషయాల్లో స్పందించేది ఇలాగేనా?

ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయం తదితర వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

high-court-issued-orders-on-uddanam-kidney-problems
ఉద్ధానం లాంటి తీవ్రమైన విషయాల్లో స్పందించేది ఇలాగేనా?

By

Published : Dec 31, 2019, 7:06 AM IST

ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన ఇలాంటి సమస్యల విషయంలో జాప్యం చేయడానికి వీల్లేదని పేర్కొంది . సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తదితర వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రమాణపత్రం దాఖలు చేయాలని స్పష్టం చేసింది .తదుపరి విచారణ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి , జస్టిస్ ఎం . వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాతంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొంటూ న్యాయవాది సింహాచలం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం ఉద్ధానం కిడ్నీవ్యాధి సమస్య పరిష్కారానికి , బాధితుల్ని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలంటూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది . తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా . .కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వం గడువు కోరింది . దీంతో అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం . . కౌంటర్లు వేయమని ఆదేశించి ఆరువారాలు అయ్యిందని . . ఇప్పటి వరకు దాఖలు చేయకపోవడం ఏమిటిని ప్రశ్నించింది . ఇంటింటికి కిడ్నీ బాధితులు ఉన్న ఇలాంటి తీవ్రమైన విషయాల్లో స్పందించేది ఇలాగేనా అని ఆగ్రహం వ్యక్తం చేసింది . ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ఎస్ . శ్రీరామ్ కు స్పష్టం చేసింది.

ఇదీచూడండి.ఆర్టీసీ విలీనానికి మరో అడుగు... ప్రజా రవాణా ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details