పులిచింతల నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో మేరక ప్రాంతాల్లో సైతం వరద నీరు చేరతోంది. కంచికంచర్ల మండలంలోని చెవిటికల్లు,గని ఆత్కూరు,కొత్తపేట,మున్నలూరులతో పాటు చందర్లపాడు మండలంలోని కొడవటికల్లు,ఉస్తేపల్లి ఏటూరు ఉపనూరు గ్రామల్లో వాణిజ్య పంటలు నీట మునిగాయి. నిన్నటి వరకు ఎంతో కొంత మిగులుతుందనుకున్న అన్నదాతలకు ఈ వరదలు తీరని వేదనను మిగిల్చాయి. వరద నీరును బయటకు పంపపేందుకు కూడా వీలు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరదనీటితో వాణిజ్య పంటల మునక
పులిచింతల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరగడంతో కృష్ణా జిల్లాలోని కంచికచర్ల ,చందర్లపాడు మండలాల పరిధిలోని వాణిజ్య పంటలు ముంపు భారిన పడ్డాయి.
పెరిగిన వరదతో...మునిగిన పంటలు