అరగంట పాటు కురిసిన భారీ వర్షం తో కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరు మండలాలు ప్రజలు బిక్కుబిక్కుమన్నారు. మండలం అవుటపల్లిలో భారీ వర్షానికి తోడు పిడుగు పడటంటో యలవర్తి రాజ్ కుమార్ అనే యువకుడు మృతిచెందాడు. నాగవప్పాడులో పెద్ద శబ్ధంతో పడిన పిడుగుకి కొబ్బరి దగ్ధం అయ్యింది. అవుటపల్లి లో పిడుగుపాటుకి గేదె మృతిచెందింది. గన్నవరం మండలం ముస్తాబాద్ లో పెనుగాలులకు చిల్లర దుకాణల్లో షార్ట్ సర్క్యూట్ కారణం గా దుకాణం దగ్ధం అవ్వగా అక్కడ అమ్మకానికి ఉంచిన పెట్రోల్ క్యాన్ నిప్పంటుకొని పేలిపోగా దుకాణ దారుడు వెంకట సాయి అగ్నికి ఆహుతై అక్కడికక్కడే మృతిచెందాడు..గన్నవరం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్ధలికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
గన్నవరంలో భారీవర్షం.. ప్రజలు అతలాకుతలం - vaana
కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీవర్షం