20 బడుల్లో.. వెయ్యి మంది విద్యార్థినులకు సైకిళ్లు - cycles
జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ రీత్యా గత విద్యా సంవత్సరంలో పంపిణీ నిలిపివేశారు. ఇప్పుడు 20 పాఠశాలల్లో వెయ్యి మందికి పైగా బాలికలకు సైకిళ్లు అందించారు.
govt-schools-cycles-distribution
రాజన్న బడిబాట పథకంలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9 ,10 తరగతులు చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. గత విద్యా సంవత్సరంలో అందజేయాల్సిన వీటిని ఎన్నికల కోడ్ రీత్యా పంపిణీ చేయలేదు. వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా అప్పటి సైకిళ్లను ఈ విద్యా సంవత్సరంలో బాలికలకు అందజేశారు. మొత్తంగా 20 ఉన్నత పాఠశాలల్లో వెయ్యి మంది విద్యార్థినులకు ఈ పథకంతో ప్రయోజనం చేకూరింది.