ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోరింటాకు... అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం - krishna

ఆషాఢమాసం- గోరింటాకు.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు పిల్లలకు, యువతులకు, మహిళలకు పండుగే. మాములుగా ఈ మాసం మంచిది కాదని శుభకార్యాలు చేయరు. అందుకేనేమా గోరింటాకు పెట్టుకోడాన్ని ఓ సంబరంలా, శుభకార్యంలా జరుపుకుంటారు మహిళామణులు.

గోరింటాకు... అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం

By

Published : Jul 15, 2019, 7:08 PM IST

కృష్ణాజిల్లా నాగాయలంకలో సంప్రదాయ గోరింటాకు, మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు, యువతులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో అందరూ మెహందీ పెట్టుకోవడంవైపే ఆసక్తి చూపుతున్నారు. కోన్​లు, రకరకాల పద్ధతుల్లో కృత్రిమంగా తయారుచేసినవి వాడుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆకునే వినియోగిస్తున్నారు. ఈ పాత సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పోటీలు ఏర్పాటుచేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

గోరింటాకు చేతులకు అందాన్నే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుందంటున్నారు బామ్మలు. గోరింటాకు పెట్టుకుంటే మానసిక రుగ్మతలు తొలగి ప్రశాంతత చేకూరుతుందనీ.. గోర్లలో ఉండే క్రిమికీటకాలు నశిస్తాయని చెప్తున్నారు. అందుకే ఏటా ఆషాఢమాసంలో అందరూ గోరింటాకు పెట్టుకోవాలని నేటి తరానికి సూచిస్తున్నారు.

గోరింటాకు... అందానిగోరింటాకు... అందానికి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యంకి అందం... ఆరోగ్యానికి ఆరోగ్యం

ABOUT THE AUTHOR

...view details