ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రి మందలించాడని.. తనువు చాలించింది! - krishna district updates

తండ్రి మందలించాడని మనస్తాపంలో బాలిక ఎలుకల మందు తాగిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

girl suicide
ఆత్మహత్య

By

Published : Aug 18, 2021, 7:56 AM IST

కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని పల్లెవాడకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని.. తండ్రి కోప్పడ్డాడన్న ఆవేదనతో ప్రాణం తీసుకుంది. చరవాణిలో ఫొటోలు డిలిట్ చేసిందని తండ్రి మందలించగా.. బాలిక మనస్తాపానికి గురై ఎలుకల మందు టీలో కలిపి తాగింది.

కుటుంబ సభ్యులు గమనించి స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details