దిల్లీ దీక్షకు మద్దతుగా గన్నవరంలో బైక్ ర్యాలీ - తెదేపా
దిల్లీ ధర్మపోరాట దీక్ష విజయవంతం కావాలని కృష్ణాజిల్లా గన్నవరం తెదేపా కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి దావాజీగూడెం గాంధీబొమ్మ వరకు నిరసన చేపట్టారు.
By
Published : Feb 10, 2019, 8:50 PM IST
తెదేపా కార్యకర్తల బైక్ ర్యాలీ
దిల్లీ ధర్మపోరాట దీక్ష విజయవంతం కావాలని కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా కార్యకర్తలు ద్విచక్రవాహనం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి దావాజీగూడెం గాంధీబొమ్మ వరకు నిరసన చేపట్టారు. మోదీ గుంటూరు పర్యటన ముగించుకుని గన్నవరం విమానశ్రయం చేరుకోగా.... ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ...నల్ల కుండలతో నిరసన వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.