కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. గన్నవరం రామ్నగర్ కు చెందిన పుష్పలత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు మేధా టవర్స్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 8 ఏళ్ళ క్రితం ఏలూరుకు చెందిన అనిల్ కుమార్ తో వివాహమైన... మనస్పర్ధలు కారణంగా గన్నవరంలోనే ఉంటోంది. ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నానని తల్లికి వీడియోకాల్ చేసింది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. గన్నవరం గ్రామ శివారు మర్లపాలెం చెరువులో శవమై కనిపించింది. సమీపంలో ఉన్న ద్విచక్రవాహనం, చరవాణి, గుర్తింపు కార్డు ఉండటంతో పుష్పలతను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి భార్యా భర్తల మధ్య వివాదాలే ఆత్మహత్యకు కారణమని తేల్చారు.
కుటుంబ కలహాలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య - vijayawada
కుటుంబ కలహాలతో గన్నవరంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.
వివాహిత ఆత్మహత్య