కృష్ణా జిల్లాలో గణనాథుడి తొలిపూజ వినాయక చవితి సందర్భంగా కృష్ణా జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో తొలి పూజ ఘనంగా నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడిలో మట్టి ప్రతిమకు ఈవో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలు, పండ్లు, పత్రాలతో మట్టి గణనాథుడిని ప్రార్థించారు. తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ సన్నిధిలో వినాయక వ్రతం చేపట్టారు. మూలమంత్ర, నవగ్రహ హోమాలు చేశారు. విజయవాడలోని బీసెంట్రోడ్డు, గాంధీనగర్, లెనిన్, సత్యనారాయణపురం కూడళ్లలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. కోర్కెలు తీర్చే గణనాథుడు తమ వద్దకు వచ్చాడని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.