ఉచితంగా స్కూటీ డ్రైవింగ్ శిక్షణ... మహిళలకు మాత్రమే - summer camp
ద్విచక్ర వాహనాన్ని నడపాలన్న కోరిక ఉన్నప్పటికీ ట్రాఫిక్కు భయపడి మహిళలు వెనకడుగు వేస్తుంటారు. ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సులు, ఆటోలపై ఆధారపడుతుంటారు. ఇలాంటి వారికి సాయం చేస్తోంది విజయవాడలోని కేబీఎన్ కళాశాల. ఉచితంగానే స్కూటీ డైవింగ్ శిక్షణ ఇస్తోంది.
రోడ్డు మీద ద్విచక్రవాహనాన్ని నడపాలంటే ఇప్పటికి కూడా చాలా మంది ఆడవాళ్లు భయపడుతుంటారు. ఇంటి దగ్గర ప్రయత్నిద్దామంటే ఓపిగ్గా నేర్పించే వారుండరు. ఈ ఇబ్బందిని తెలుసుకున్న విజయవాడలోని కేబీఎన్ కళాశాల యాజమాన్యం... వేసవి శిక్షణ తరగతుల్లో మహిళలకు ఉచితంగా స్కూటీ డ్రైవింగ్ నేర్పిస్తోంది. ఉదయం కొన్ని బ్యాచ్ లు, సాయంత్రం కొన్ని బ్యాచ్ లుగా సుమారు 360మంది ప్రస్తుతం కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో స్కూటీ నడపడం నేర్చుకుంటున్నారు. స్కూటీ శిక్షణకు అనూహ్యమైన స్పందన వచ్చింది. నగరం నలుమూలల నుంచి మహిళలు వచ్చి స్కూటీ నడపడం నేర్చుకుంటున్నారు. 40, 50 ఏళ్లు పైబడి వాళ్లు సైతం స్కూటీ నేర్చుకోవాడనికి ఆసక్తి చూపడం విశేషం