కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వేంపాడు అగ్రహారంలో భూవివాదం కారణంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సాగుదారులు, స్థానిక నాయకుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మీర్జాపురం గ్రామానికి చెందిన కూలీలు తోటలో పనిచేస్తుండగా... స్థానిక నేతలు కర్రలతో దాడి చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... నలుగురికి గాయాలు - krishna district crime
కృష్ణా జిల్లా గొల్లపల్లి వేంపాడు అగ్రహారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భూమి విషయంతో తలెత్తిన గొడవలో నలుగురికి గాయాలయ్యాయి.
ఇరువర్గాల మధ్య ఘర్షణ