Former Vice President Venkaiah Naidu : భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సహా మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. ఆంగ్లాన్ని నేర్చుకున్నా మాతృభాషను ఎవరూ విస్మరించకూడదని.. పిల్లలకు మాతృభాషను తల్లిదండ్రులు తప్పక నేర్పించాలన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని రక్షిస్తుందని.. నీటిని, చెట్లను, రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. సూర్యరశ్మిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని సూచించారు.
మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి: వెంకయ్య నాయుడు
Former Vice President : మాతృభాషను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఏ భాష నేర్చుకున్నా.. మాతృభాషను విడవకూడదని.. మాతృభాష విశిష్టతను ఆయన గుర్తు చేశారు.
యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని వెంకయ్యనాయుడు సందర్శించారు. ఆలయ ధర్మకర్తలు, అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్లను దర్శించుకున్న ఆయన.. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహిస్తోన్న మహా సౌరయాగంలో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వాదం అందించారు. ధర్మ రక్షణ కోసం, మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్య కల్పన కోసం పూర్వీకులు ఆలయాలు నిర్మించారన్నారు. సూర్యుడి వెలుతురును వినియోగించుకున్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. విజయవాడలో మహాత్మాగాంధీ రోడ్డును.. ఎంజీ రోడ్డు అనడం దౌర్భాగ్యమన్న వెంకయ్య.. ఎంజీ రోడ్డును మహాత్మాగాంధీ రోడ్డు అని పిలవాలని కోరారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇవీ చదవండి :